అభిమాని కోసం ఏడ్చిన స్టార్‌ హీరో..!

386
Actor Karthi cried in his fan's funeral!
- Advertisement -

సినిమా హీరోల‌కు అభిమానులు ఉండ‌టం స‌హ‌జ‌మే. వారిలో కొంత‌మంది వీరాభిమానులు ఉంటారు. వీరంతా క‌లిసి అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి త‌మ హీరోల పేరు మీద మంచి ప‌నులు చేస్తుంటారు. అలాంటి అభిమానుల‌ను పొందినందుకు న‌టులు గ‌ర్వ‌ప‌డుతుంటారు.వారితో వ్య‌క్తిగ‌తంగా ప‌రిచ‌యాలు కూడా పెంచుకుంటుంటారు. త‌మిళ‌నాడులో ఇలాంటి అభిమానులు చాలా మంది ఉంటారు. ప్ర‌ముఖ న‌టుడు కార్తీ పేరు మీద కూడా అక్క‌డ చాలా అభిమాన సంఘాలు ఉన్నాయి.

Actor Karthi cried in his fan's funeral!

అయితే మనల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తులు చనిపోతే ఉండే బాధే వేరు. తమిళ స్టార్ హీరో కార్తీ ఇప్పుడు అలాంటి బాధతోనే బోరుమన్నాడు. అతను తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. జీవన్ కుమార్ అనే కార్తీ అభిమాని నిన్న జరిగిన ఓ కారు ప్రమాదంలో చనిపోయాడు. జీవన్ కార్తీకి వీరాభిమాని. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కార్తీ అభిమానుల సంఘానికి అతను అధ్యక్షుడు కూడా. కార్తీ మీద పలు సందర్భాల్లో వీరాభిమానాన్ని చాటుకున్న జీవన్.. తన అభిమాన కథానాయకుడికి వ్యక్తిగతంగానూ చేరువయ్యాడు. కార్తికి కూడా జీవన్ బాగా తెలుసు.

Actor Karthi cried in his fan's funeral!

మూడు నెలల కిందట అతడి పెళ్లికి కూడా కార్తి హాజరయ్యాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. జీవన్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన కార్తీ తీవ్రంగా కలత చెందాడు. బుధవారం తిరువన్నామలైలో జీవన్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కార్తీ బోరుమని ఏడ్చేయడం ఒకింత ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టే జీవన్ కార్తీకి ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఓ అభిమాని కోసం హీరో ఏడవడం అరుదైన విషయమే. జీవన్ వయసు 27 ఏళ్లు మాత్రమే. మూడు నెలల కిందట కార్తీ తన పెళ్లికి హాజరైనపుడు పెళ్లి దుస్తుల్లో అతను కార్తిని హత్తుకుంటూ ముద్దు పెడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -