గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు గిరిబాబు..

519
giri babu green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సినీ నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన టాలీవుడ్ నటుడు గిరిబాబు ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. మొక్కలను మనం నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మరొక ముగ్గురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు గిరిబాబు.

giri babu

ప్రముఖ హాస్యనటుడు ఆలీ,కృష్ణ భగవాన్,రఘు బాబులను మొక్కలు నాటాలని గిరిబాబు కొరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు కాదంబరి కిరణ్,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ పాల్గొన్నారు.

Tollywood Actor Giri babu accepts Green Challenge from TRS MP Santosh Kumar.he plants saplings On monday..

- Advertisement -