నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత

7
- Advertisement -

ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

రెండు కిడ్నీలని మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో వెంకట్ కన్నుమూశారు. విశ్వక్‌సేన్‌, జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని వంటి వారు ఆర్థిక సాయం అందించారు. అయినా సర్జరీకి సరిపడ డబ్బు సమకూరలేదు.

వివి వినాయక్‌ సినిమాల ద్వారా పాపులర్‌ అయ్యారు వెంకట్. ఆది , దిల్‌ , నాయక్‌, అత్తారింటికి దారేది వంటి హిట్‌ సినిమాల్లో వెంకట్‌ నటించారు. గబ్బర్‌ సింగ్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా కాఫీ విత్‌ ఏ కిల్లర్‌ సినిమాలో కనిపించారు.

Also Read:‘గరివిడి లక్ష్మి’గా ఆనంది ఫస్ట్ లుక్

- Advertisement -