తమిళ నిర్మాతల మధ్య నెలకొన్న సంక్షోభం తారాస్ధాయికి చేరింది. నిర్మాతల మండలిలోకి విశాల్‌ని రానిచ్చేది లేదంటూ ఆయన ప్రత్యర్థులు అడ్డుకోవడంతో విశాల్ తాళం పగటగొట్టిలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో చివరకు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
నిర్మాతల సమస్యలను పట్టించుకోవడం లేదని.. పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ సినిమాల వెబ్‌సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు.
విశాల్ రాజీనామా చేయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఈ నెల 21న తమిళనాట ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేలా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ చిన్న సినిమాల నిర్మాతలు విశాల్‌ను నిలదీస్తున్నారు. మొత్తంగా నాడు విశాల్‌కు మద్దతిచ్చిన వారే నేడు తిరుగుబాటు జెండా ఎగరేయడంతో విశాల్ తల పట్టుకున్నారు.