దీప్ సిద్దూ అరెస్ట్…

137
deep sidhu
- Advertisement -

రైతుల ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్దూను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.పంజాబ్‌లో అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్‌ పోలీసులు మంగళవారం ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్ర‌కోట‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో దీప్ సిద్ధూ ప్ర‌ధాన నిందితుడు. ఈ ఘటన తర్వాత ప‌రారీలో ఉన్న దీప్ సిద్ధూ కోసం గాలింపు చర్యలు తీవ్రం చేసిన పోలీసులు రూ.ల‌క్ష రివార్డు కూడా ప్ర‌క‌టించారు.

సిద్దూతో పాటు జెండా ఎగుర‌వేసిన జుగ్‌రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్‌, గుర్జంత్ సింగ్‌పై రూ. ల‌క్ష రివార్డు ప్ర‌క‌టించారు. ఇక జాజ్బిర్ సింగ్‌, బూటా సింగ్‌, సుఖ్‌దేవ్ సింగ్‌, ఇక్బాల్ సింగ్‌పై రూ. 50 వేల రివార్డు ప్ర‌క‌టించారు. కిసాన్ ర్యాలీ అల్ల‌ర్లకు సంబంధించి మొత్తం 44 కేసులు న‌మోదు చేయ‌గా, 122 మందిని అరెస్టు చేశారు.

- Advertisement -