నటుడు చంద్రమోహన్ కన్నుమూతతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. కాగా, హైదరాబాద్‌లో నవంబర్ 13వ తేదీన ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే, రెండేళ్ల క్రితం ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పట్లో దీనిపై ఆయన స్పందించారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని సూచించారు.
అంతేకాదు, ‘చంద్రమోహన్‌ను ముందే చేంపేశారు’ అంటూ సినీ ప్రముఖులు సైతం నెటిజన్లపై మండిపడ్డారు.దారుణం: ‘చంద్రమోహన్‌ను ముందే చంపేశారు’ ఇక చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన నటుడు చంద్రమోహన్. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. కానీ మీకు తెలుసా ?, అప్పట్లో చంద్రమోహన్ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ముఖ్యంగా 1978లో ఆయన హీరోగా రిలీజైన పదహారేళ్ల వయసు చిత్రం అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
శ్రీదేవి, మోహన్‌బాబుతో కలిసి చంద్రమోహన్ నటించారు. ఈ సినిమాలో కుంటివాడి పాత్రలో ఆయన నటించాడు. ఆనాటి ఫిల్మ్ లవర్స్‌ను ఈ సినిమాలోని ఓ సాంగ్ తెగ ఇంప్రెస్ చేసింది. మా ‘ గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున చంద్రమోహన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:జనసేన దారి.. గోదారే!