నటి పవిత ఆత్మహత్య మర్చిపోకముందే ఆమె భర్త చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర మరణించడంతో ఆ బాధని తట్టుకోలేక చంద్రకాంత్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రకాంత్ ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది.
అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని..ఆమె వల్లే తన దూరమయ్యాడని ఆరోపించింది. గతంలో చందు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్నారు. పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడు. పవిత్ర సడెన్ గా చనిపోవడంతో డిప్రెషన్ లో ఉన్నాడు. మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడన్నారు.
గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళాడు. మూడురోజుల క్రితం మా ఇంటికి వచ్చి పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడని తెలిపారు.
Also Read:మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్