గోవాలో నటుడు బ్రహ్మాజీ కుమారుడు పెళ్లి..

776
Brahmaji son
- Advertisement -

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరితోనూ నటించిన అనుభవం బ్రహ్మాజీకి ఉంది. 30 ఏళ్లుగా తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్రహ్మాజీ ఇప్పటికీ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ నటుడి తనయుడు సంజయ్ వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా త్వరలోనే నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యే సంజయ్ నటించిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి ఘనంగా జరిగింది.

Brahmaji

బోపాల్ కుటుంబానికి చెందిన ప్రమోద్ వర్మ, పూనమ్ కుమార్తె అనుకృతి దీక్షిత్‌ను బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ వివాహం చేసుకున్నాడు. గోవాలోని ప్లానెట్ హాలీవుడ్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుక‌కి సంజయ్ స్నేహితులుగా ఉన్న మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Actor-Brahmaji-Son-Wedding

 

- Advertisement -