సైన్స్ ఫిక్ష‌న్‌లో శిరీష్…

203
- Advertisement -

మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న శిరీష్‌కు శ్రీర‌స్తు స‌క్సెస్ ఇచ్చి అత‌డిలో జోష్ నింపింది. ఫ్యామిలీ అండ్ యూత్‌ను మెప్పించే సినిమాగా తెర‌కెక్కిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తుకు ఫైన‌ల్‌గా అన్ని ఏరియాల్లోను మంచి వ‌సూళ్లు రావ‌డంతో పాటు ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్ల నుంచి నిర్మాత‌లు ఇలా అంద‌రికి లాభాల పంట పండించింది. శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు త‌రువాత మంచి క‌థ‌ల‌తో ముందుకు వెలుతున్న అల్లు శిరీష్ హీరోగా, టైగ‌ర్ లాంటి స‌క్స‌స్‌ఫుల్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌న టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

ప్ర‌స్తుతం ఈచిత్రం యోక్క స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌సెన్సెష‌న‌ల్ మూవి తెర‌కెక్కుతుంది. ఈచిత్రం ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తిచేసుకుంది. ఈ చిత్రం త‌రువాత శిరీష్ హీరోగా చిత్రం సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. మ‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌ర‌లో నిర్మాత‌లు తెలియ‌జేస్తారు.

- Advertisement -