స్టార్ కమెడియన్ అలీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆస్ట్రేలియన్ బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్ ( డైరెక్టర్– గవర్నర్ అండ్ కంప్లేయిన్స్) ఇండియాకు తీసుకుని వచ్చి.. ఆ కంపెనీ తరపున సేవ చేయబోతున్నారు అలీ. బాగా చదువుకుని టాలెంట్ ఉండి డబ్బుల్లేక ఇబ్బంది పడే ఎంతోమందికి సాయం చేయటానికి అలీ ఆర్వేన్సిస్ సీఈవో డైరెక్టర్ శశిధర్ తో కలిసి ఈ సేవా కార్యక్రమం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ ముఖ్య సలహాదారుగా అలీ ప్రజల్లో మమేకం అవుతున్నారు.
తాజాగా ఆయన విద్యా దానం చేయడానికి మరింతగా కసరత్తులు చేయడం విశేషం. ఈ విషయం గురించి అలీ మాట్లాడుతూ.. ‘ఓ కార్యక్రమంకోసం గెస్ట్‌గా పిలిస్తే ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ ఉన్న మన తెలుగువారందరూ ఎంతోమందికి సాయం చేయటం చూశాను. ఆరోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి.. మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా, నేను కూడా మీకు అండగా నిలబడతాను అని వారితో చెప్పాను.
అయితే, ఈ రోజు నన్ను నమ్మి ఇండియాకి వచ్చారు. మేమంతా అవసరంలో ఉన్న వారికి సాయం అందించే ఉద్ధేశ్యంతో ఉన్నాం. నా వల్ల ఒక పది కుటుంబాలకి మంచి జరిగినా చాలు’ అని అలీ అన్నారు. ఇప్పటికే అలీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్వేన్సిస్ కంపెనీకి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌లా పని చేసి.. మరింత సేవ చేయాలి అనుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి..