గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని…మనిషికి మూడు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు సినీ నటులు అలీ,కృష్ణ భగవాన్, రఘుబాబు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జీహెచ్‌ఎంసీ పార్కులో వీరు కాదాంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వీరు తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన హరితహారం కార్యక్రమానికి కొనసాగింపుగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ తమకెంతో స్పూర్తి నింపిందన తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రతి ఒక్కరు 3 మొక్కలు చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ను ఇవ్వాలన్నారు.
గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని… ఇఫ్పటికి కోట్లకు పైగా మొక్కలు నాటడం అభినందనీయం అన్నారు. మనిషి తనను తాను రక్షించుకోవాలంటే ప్రకృతిని రక్షించాల్సిందేనన్నారు. సినీనటులంతా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని తమ అభిమానులను ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వాలని చెప్పారు.
The Green India Challenge was started by TRS Mp Joginapally Santosh Kumar. Actors Ali,Krishnbagavn,Raghu babu planted saplings as part of the Challenge…