యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘వార్‌మెన్ బేస్- 51’ ప్రారంభం..

84
- Advertisement -

కార్తిక్ రాచ‌పూడి, సంయుక్త గాలి హీరోహీరోయిన్లుగా కిగోర్ ద‌ర్శ‌క‌త్వంలో కేఆర్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్నవార్‌మెన్ బేస్ -51 చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ రోజు ప్రారంభ‌మైంది. మొద‌టి స‌న్నివేశానికి విజ‌న్ మ్యాజిక్ సీఈఓ సాంభ‌శివ రావు క్లాప్ కొట్టగా నిర్మాత రాచ‌పూడి మాధురి కెమెరా స్విచ్ఆన్ చేశారు. ద‌ర్శ‌కుడు కిగోర్ ఫ‌స్ట్ షాట్‌ని డైరెక్ట్ చేశారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ విశ్వ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ నెలాఖ‌రు నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.

ఈ సంద‌ర్భంగా హీరో కార్తిక్ రాచ‌పూడి మాట్లాడుతూ – ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మ‌వు తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు కిగోర్ మంచి స్క్రిప్ట్ రాశారు. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నా అన్నారు.

హీరోయిన్ సంయుక్త గాలి మాట్లాడుతూ – నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లకు థ్యాంక్స్‌..ఒక మంచి సినిమాతో త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తాం అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఇక్క‌డికి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. మంచి స్క్రిప్ట్ కుదిరింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌. కార్తిక్‌, సంయుక్త పాత్ర‌లు కొత్త‌గా ఉంటాయి. పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉంటుంది. త‌ప్ప‌కుండా వారిద్ద‌రికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుంద‌ని భావిస్తున్నాం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌య్యింది. అతి త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు.

న‌టీన‌టులు: కార్తిక్ రాచ‌పూడి, సంయుక్త గాలి, విశ్వ

సాంకేతిక వ‌ర్గం
దర్శక‌త్వం: కిగోర్‌
డిఓపి: కిగోర్‌
మ్యూజిక్‌: రిబిన్ రిచ‌ర్డ్‌
ఎడిట‌ర్‌: పివి రామాంజ‌నేయ రెడ్డి
ఫైట్స్‌: రాబిన్ సుబ్బ‌
లిరిసిస్ట్‌: కె కె
పాట‌లు: నిహ‌ల్ సాధిక్‌
పీఆర్ఓ: తేజ‌స్వి సజ్జ

- Advertisement -