‘RRR’ సినిమాలో మ‌హాన‌టి..

313
RRR movie
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే ఈసినిమా పూజా కార్య‌క్ర‌మాలు కూడా పైర్తైన విష‌యం తెలిసిందే. ఈకార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్, రానా ప‌లువురు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ నెల 29వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

rajamouli

ఈమూవీలో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లు డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ ప్ర‌ముఖ ట్రైన‌ర్ వ‌ద్ద శిక్షణ తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం. అయితే రామ్ చ‌ర‌ణ్ మాత్రం సంక్రాంతి త‌రువాతి నుంచి సినిమాలో పాల్గోనున్నాడు. ఎందుకంటే ప్ర‌స్తుతం అత‌ను బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న విన‌య విధేయ రామ సినిమాలో న‌టిస్తున్నాడు.

keerthy

సినిమా విడుద‌ల తర్వాత షూటింగ్ లో పాల్గోన‌నున్న‌ట్లు తెలుస్తుంది. అయితే ఈమూవీలో ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌న‌నున్న‌ట్లు ఫిలిం న‌గ‌ర వ‌ర్గాల స‌మాచారం. అందులో మొద‌టి హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో తెలుగు, త‌మిళ్ లో ఆమెకు భారీగా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

- Advertisement -