‘ఆచార్య’ నుండి బంజారా సాంగ్.. అదిరిపోయేలా చిరు-చరణ్‌ డాన్స్‌..

35
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య చిత్రం నుంచి ‘భలే భలే బంజారా’ పాట విడుదలైంది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో చిరు-చరణ్‌ కలిసి డాన్స్‌ చేసిన ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. ఈ లిరికల్‌ సాంగ్‌లో హీరోలిద్దరినీ చూస్తుంటే కనులు విందుగా ఉంది. ఇక అభిమానులకైతే పండగే! అని చెప్పాలి. ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. లైవ్‌లో తండ్రీకొడుకులు డాన్స్‌ చూడటానికి చిరు కుటుంబం మొత్తం సెట్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

https://youtu.be/a2UJFZuNuKg
- Advertisement -