ఓటీటీలో ఆచార్య!

80
acharya
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

దీంతో ఇప్పుడు ఆచార్య ఎప్పుడు విడుదలవుతుందా అని అంతా ఆసక్తికగా ఎదురుచూస్తుండగా ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆచార్యకు సంబంధించి ఓటీటీ డీల్ పూర్తయిందని..త్వరలోనే విడుదల తేదీతో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.

ఆచార్య పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి, కనీసం మూడు వారాలయ్యాక అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. మే నెల చివర్లో ‘ఆచార్య’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తాజా టాక్. మణిశర్మ సంగీతం అందించగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -