ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘ఆచార్య’ ఐటమ్‌ సాంగ్..

93
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇంతకు ముందు వదిలిన పాటలకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈనేపథ్యంలో ఇటీవల ఈ మూవీ నుండి స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

‘శానా కష్టం వచ్చిందే మందాకినీ .. చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకుపోని’ అంటూ సాగిన ఈ పాటలో చిరు – రెజీనా ఆడిపాడారు. మణిశర్మ బీట్ .. భాస్కరభట్ల సాహిత్యం .. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటను వదిలిన క్షణాల్లోనే జెట్ స్పీడ్‌తో అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 10 మిలియన్స్ కి పైగా వ్యూస్‌ను రాబట్టేసింది. మాస్ ఆడియన్స్ కి ఈ సాంగ్ ఒక రేంజ్‌లో కనెక్ట్ అయిందనే చెప్పాలి.

https://youtu.be/Kn42r5UUhqE
- Advertisement -