‘ఆచార్య’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..!

88
Acharya
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబోలో రూపొందిన ‘ఆచార్య’ ఈనెల 29ప విడులైంది. ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషించగా, ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించింది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూసూద్ నటించాడు.

తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోను తొలి రోజున ఈ సినిమా 33 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. ఒకరకంగా ఇది మంచి వసూళ్లేనని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు. రామ్ చరణ్ సిద్ద పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించారు దర్శక నిర్మాతలు.

- Advertisement -