రిపబ్లిక్ డే కానుకగా….ఆచారి అమెరికా యాత్ర

250
‘Achari America Yatra’ To Hit Screens On January 26th
- Advertisement -

విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది. ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్ర టీజర్ మరియు పాటల ప్రోమోలకు విశేష స్పందన వస్తుంది. కామెడీ ప్రధానంగా సాగే టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన ‘స్వామి రా రా’ అనే బీట్ ప్రధానంగా సాగే పాట ప్రేక్షకుల చేత స్టెప్పులేయించెలా ఉండగా, సంక్రాంతి నాడు విష్ణు విడుదల చేసిన మరో పాట ‘చెలియా’ సంగీత ప్రియులను అలరిస్తోంది.

అచ్చు రాజమణి సంగీతం సమకూర్చిన ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మనసును హత్తుకొనెలా ఉన్నాయి. పాటలకు వస్తున్న మంచి స్పందనతో నిర్మాతలు ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదలచేయు సన్నాహాలు చేస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం జనవరి 26 న విడుదల కానుంది.

జి.నాగేశ్వర్ రెడ్డి, విష్ణుల కలయికలో ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోదాన్ని అందించనుంది ఆశించవచ్చు. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ నటించిన ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు.

ఇతర తారాగణం:తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్ సింగ్, సురేఖ వాణి,సాంకేతిక వర్గం:రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి,ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్,ఎడిటింగ్: వర్మ ,సంగీతం: ఎస్ ఎస్ థమన్, అచ్చు రాజమణి,మాటలు: డార్లింగ్ స్వామి,ఆర్ట్ : కిరణ్ ,యాక్షన్ : కనాల్ కన్నన్,బ్యానర్ : పద్మజ పిక్చర్స్ ,సమర్పించు : ఎం ఎల్ కుమార్ చౌదరి,నిర్మాతలు: కీర్తి చౌదరి , కిట్టు,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జి నాగేశ్వర రెడ్డి

- Advertisement -