- Advertisement -
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు శరత్(74) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు. శనివారం ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక శరత్ సుమన్ హీరోగా తెరకెక్కిన ‘చాదస్తపు మొగుడు’ చిత్రంతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమైన ఆయన ‘అబ్బారుగారి పెళ్లి’, ‘చిన్నల్లుడు’, ‘వంశోద్ధారకుడు’ ‘పెద్దింటి అల్లుడు’, ‘సుల్తాన్’, ‘సూపర్ మొగుడు’ ‘బంధువులొస్తున్నారు జాగ్రత్త’ చిత్రాలకు శరత్ దర్శకత్వం వహించారు.
- Advertisement -