వీడియో: ద్రవిడ్ కారుకు ప్రమాదం

16
- Advertisement -

టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ద్రావిడ్ ప్రయాణిస్తోన్న కారు, ఓ గూడ్స్ ఆటో ఢీ కొన్నాయి. దీంతో రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరుగగా బెంగళూరులోని బిజీ ఏరియా కన్నింఘమ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 24,000కి పైగా రన్స్ చేసిన ద్రవిడ్ 2007 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. టీమిండియా హెడ్ కోచ్‌గా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత ఆయన పదవీ కాలం ముగిసింది.

Also Read:తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు..

 

- Advertisement -