- Advertisement -
సిద్దిపేట డీసీపీ గోవింద నర్సింహారెడ్డి ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారు. సిద్దిపేటలోని తన నివాసంతో పాటు కామారెడ్డి, అదిలాబాద్, హైదరాబాద్ లోని తన నివాసాలపై ఏక కాలంలో రైడ్ చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు, బినామీల పేరుతో భారీగా అక్రమ ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు రావడంతో దాడులు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
సిద్దిపేట , మహబూబ్ నగర్, హైదరబాద్లోని గొల్కండ లో భారీ గా అక్రమ అస్తులు గుర్తించారు. ఇప్పటి వరకు ఉన్నసమాచారం మేరకు రూ.5కోట్ల పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తుంది. సిద్దిపేట చుట్టు పక్కల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు అలాగే హైదరాబాద్ చైతన్య పురిలోని ఒక బ్యాంక్ లాకర్ ఉన్నట్లుగా గుర్తించినట్లు సమచారం.
- Advertisement -