ఫార్ములా-ఈ కార్ రేస్..ఏ1గా కేటీఆర్

0
- Advertisement -

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై 4 సెక్షన్లు.. 13(1)A, 13(2)పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేసింది.

ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ చర్చకు అనుమతించకుండా కేటీఆర్‌పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్‌పై కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు హరీశ్‌ రావు.

Also Read:రేవంత్ నడిపేది సర్కార్ కాదు సర్కస్!

- Advertisement -