ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ట్రాఫిక్ పోలీసుల కష్టాలు వర్ణణాతీతం. గంటల తరబడి రోడ్లపై విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుననాయి.
ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన విధానంతో ముందుకువచ్చారు. చెన్నైలోని అవడి సిటీ పోలీసులు ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తెచ్చారు.ఈ హెల్మెట్లు మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ చల్లదనం ఇవ్వగలవు. మెడ క్రింది భాగం కన్నా తల భాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని అందిస్తాయి.
దీంతో తలనొప్పి, నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. మండుటెండల తీవ్రత నుంచి తలకు చల్లదనాన్ని అందించి, విధులు మరింత సౌకర్యవంతంగా నిర్వర్తించేందుకు సహాయపడతాయి. తలనొప్పి, చెమటతో నిండి అలసట, ఒత్తిడి తగ్గించేందుకు సహాయపడతాయి. మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు వీలుంటుంది. పొడవైన విధి సమయంలో ఒత్తిడి లేకుండా పని చేయగలుగుతారు. వీటిని రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో కఠినమైన భద్రతా ప్రమాణాలతో తయారుచేశారు. ఈ టెక్నాలజీ విజయవంతమైతే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని ట్రాఫిక్ పోలీసులకు దీన్ని అందించే అవకాశముంది.
Also Read:థ్రిల్లింగ్ మ్యాచ్..ఢిల్లీ సంచలన విజయం