- Advertisement -
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అధినేత అబూ హసన్ అల్-హషిమీ అల్-ఖురేషి హతమయ్యాడు. ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో మృతిచెందినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేసింది ఐసీస్. ఇక ఐసీస్ కొత్త చీఫ్‌గా అబూ అల్-హుస్సేన్ అల్-హుస్సేని అల్-ఖురేషిని నియమించినట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో ఐసిస్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్-హషిమీని అమెరికా బలగాలు చుట్టుముట్టగా తనకు తాను పేల్చుకుని చనిపోయాడు. దీంతో ఆయన స్థానంలో అబూ అల్ హసన్ ఐసిస్ పగ్గాలు చేపట్టగా పది నెలల వ్యవధిలోనే అతడు కూడా హతమయ్యాడు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -