హీరోగా విలన్‌గా రాణిస్తున్న విజయ్ క్రిష్ణ..

96

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ విజయ్ క్రిష్ణ ఈయన దుర్మార్గుడు సినిమాతో హీరోగా ఆంధ్ర, తెలంగాణలో అందరికి సుపరిచితులు అయ్యారు. రీసెంట్‌గా బెక్కం వేణుగోపాల్ పాగల్ మూవీలో డైరెక్టర్ నరేష్ విలన్ గా ఛాన్స్ ఇవ్వటం జరిగింది. ఈయన తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.

-సార్ మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు..
హీరోగా గోవిందా భజ గోవిందా పోస్ట్ ప్రొడక్షన్‌లో వుంది. డైరెక్టర్ సూర్య కార్తికేయ డబ్బింగ్ దశలో వుంది.అలాగే రీసెంట్‌గా విలన్‌గా రెండు సినిమాలు చేశాను. దూరదర్శన్ ఒక మూవీ ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు, మరొక ప్రేమకధ అని ఒక మూవీ ఈ రెండు సినిమాలు విలన్‌గా చేశాను. ఇది కూడా రిలీజ్ కి సిద్ధంగా వుంది. నిర్ణయం ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. దీనిలో కూడా విలన్‌గా చేస్తున్నాను, పాగల్ మీ అందరికి తెలిసిందే అందులో విలన్‌గా చేశాను అని రీసెంట్‌గా లాస్ట్ మంత్ అలెర్ట్ అనే మూవీలో హీరోగా చేస్తున్నాను ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో ఓపెన్ అయ్యింది. దీనికి ముఖ్య అతిధులుగా బెక్కం వేణుగోపాల్, డైరెక్టర్ వి.సముద్ర, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖులు అందరు విచ్చేయటం అశ్విర్వదించటం జరిగింది. ఈ సినిమా నెక్స్ట్ మంత్ షూటింగ్ కి సిద్ధం గా వుంది.

-మీకు ఇన్ని అవకాశాలు కల్పించిన వాళ్ళకి ఏమి చెప్పాలి అనుకుంటున్నారు..
నన్ను ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే యూట్యూబ్ మిత్రులకి వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

-సార్ మీరు సినిమాలలోకి రావటానికి కారణం ఏమైనా చెప్పగలరా..
నా చిన్నప్పుడు మా మావయ్యకి వీడియో లైబ్రెరీ ఉండేది, వీసీడీ క్యాసెట్స్ టైమ్‌లో ఆ సినిమాలు చూస్తూ చిరంజీవి, కృష్ణ,సుమన్ భాను చందర్, శ్రీకాంత్, ఇప్పుడు జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలు చూస్తూ వచ్చాను. నాకు ముఖ్యంగా చిరంజీవి అంటే చాలా ఇష్టం, ఆయన నటన అన్నా చాలా ఇష్టం,అలాగే జూ. ఎన్టీఆర్ అయితే తన యాక్షన్ చుస్తే లీనం అయిపోతాను. అలా నా సినీప్రస్థానం స్టార్ట్ అయ్యింది, పట్టు వదలకూడదు ఇందులో రాణించాలి రాణించాలి అని చెప్పి ఫస్ట్ రెండు సినిమాలు ప్రొడ్యూసర్ గా చేసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో దుర్మార్గుడి సినిమా లో చేయటం జరిగింది.తరువాత కంటిన్యూ గా సినిమాలు అన్ని చేస్తూవచ్చాను.