అబీర్‌ గులాల్‌ సినిమా బ్యాన్!

8
- Advertisement -

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిని సీరియస్‌గా తీసుకుంది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదులకు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా పాకిస్థాన్‌కి చెందిన న‌టుల‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన‌ట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వార్త‌లు వైర‌ల్‌గా మారాయి.

పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ 9 ఏండ్ల‌ తర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ న‌టి వాణీకపూర్‌ , పాకిస్థాన్ న‌టుడు ఫవాద్‌ ఖాన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం అబీర్‌ గులాల్‌ . ఈ సినిమా మే 09న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. ఇందులో పాకిస్థాన్ న‌టుడు ఫ‌వాద్ ఖాన్ హీరోగా న‌టిస్తుండ‌డంతో మూవీని కేంద్రప్ర‌భుత్వం బ్యాన్ చేసిన‌ట్లు తెలుస్తుంది.

Also Read:భద్రకాళి అమ్మవారి సన్నిధిలో కవిత

ఇటీవ‌లే ఈ మూవీ నుంచి రెండు పాట‌ల‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేయ‌గా.. తాజాగా వాటిని యూట్యూబ్‌లో నుంచి మేక‌ర్స్ తొల‌గించారు.

- Advertisement -