అభిషేక్ పిక్చర్స్‌కి బెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అవార్డు

314
- Advertisement -

భారతీయ చలన చిత్ర రంగం అభివృద్ధే లక్ష్యంగా ప్రముఖ వ్యాపారవేత్త, దర్శక-నిర్మాత సోహాన్ రాయ్ ‘ఇండీవుడ్’ అనే వేదిక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వివిధ దేశాల చిత్ర పరిశ్రమలను ఒక్క వేదికపై తీసుకొచ్చి ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ నిర్వహించారు. ఇందులో ఫారిన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో 2016 సంవత్సరానికి గాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ కు “బెస్ట్ డిస్ట్రిబ్యూటర్” అవార్డు వచ్చింది.

Simanthudu Nizam Rights for Abhishek Pictures

ఫారిన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో ఒకే ఒక్క అవార్డు ఇవ్వడం, అది కూడా అభిషేక్ పిక్చర్స్ కి రావడం విశేషం. తెలుగులో మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో..’, గుణశేఖర్-అనుష్కల ‘రుద్రమదేవి’ వంటి భారీ హిట్ చిత్రాలతో పాటు ‘కుమారి 21ఎఫ్’ వంటి విజయవంతమైన చిన్న చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఘనత అభిషేక్ పిక్చర్స్ సొంతం. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా, అడవి శేష్ హీరోగా ‘గూడాచారి’, ‘స్వామి రారా’ కాంబినేషన్ హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మలతో ఓ సినిమా, సుధీర్ బాబు హీరోగా బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితకథతో ఓ సినిమా, బాలీవుడ్ హిట్ ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ సినిమాలను నిర్మిస్తున్నారు.

- Advertisement -