వర్మనే ఆటపట్టించిన బచ్చన్‌…

184
Abhishek Bachchan trolls RGV on his ...

పుట్టిన రోజు వచ్చిందటే చాలు..ఫుల్‌ హంగామా. ఫ్రెండ్స్‌తో పార్టీలు, సన్నిహితులతో జల్సాలు, ఆ రోజంతా జబర్ధస్త్‌ జోష్‌ మీదుంటారు. కానీ వర్మకి ఇలాంటివన్నీ నచ్చవు. ఆయన రూటే సపరేటు. ఎందుకలా? అంటే.. ‘నా ఇష్టం’ అంటారు. ఏదేమైనా వర్మ ప్లేస్‌ కి డోకా లేదనే చెప్పాలి. ఎందుకంటే వర్మలా ఆలోచించే వాళ్ళున్నా…ఆచరించే వారు  దొరకడం మాత్రం కష్టం.
 Abhishek Bachchan trolls RGV on his ...
ఈరోజు ఆయన 55వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. కానీ వర్మ హ్యాపీగా లేరంట. ఎక్కడ ఏం జరిగినా సోషల్‌మీడియా ద్వార రియాక్ట్ అయ్యే వర్మ ఇప్పుడు ఆయన బర్త్‌డే రోజు పైనే ట్వీట్‌ చేసేశారు.

ఆ ట్వీట్‌ లో ఓ పక్క బాధపడిపోతూ..మరో పక్క భయపడుతున్నారు వర్మ.  ఇంతకీ వర్మ ఆ ట్వీట్లో  ఏంచెప్పారంటే..‘సంతోషంగా పుట్టినరోజు జరుపుకోండి అంటూ నాకు విష్‌ చేస్తున్న వారందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. నాకు ఇది బాధాకరమైన రోజు. ఎందుకంటే నా వయసు మరో సంవత్సరం పెరిగింది’ అని ట్వీట్‌ చేశారు.
 Abhishek Bachchan trolls RGV on his ...
ఆయన వయసు పెరిగిపోతోందని వర్మ తెగ ఫీలైపోతున్న టైంలో బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌.. వర్మను ఆటపట్టించేందుకు ప్రయత్నించాడు. ‘వర్మకి బర్త్‌డేలంటే చాలా ఇష్టం. మనమంతా కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం. ఆయనకి బర్త్‌డేలకి మించి ఇంకేమీ చిరాకు తెప్పించవు.’ అని ఆటపట్టించాడు అభిషేక్‌.