- Advertisement -
తెలుగు ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే చాలామంది హీరోల వారసులు వెండితెరకు పరిచయం కాగా తాజాగా దుగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో ఆరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. హీరో రానా తమ్ముడు అభిరామ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాడు.
వాస్తవానికి అభిరామ్ ఎంట్రీపై కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే అవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోగా తాజాగా తన ఎంట్రీపై స్పందించారు అభిరామ్. తన తొలిసినిమా లవ్ స్టోరీ కథగా ఉంటుందని తెలిపాడు.
దగ్గుబాటి రామానాయుడు 85వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅ అర్పించిన అభిరామ్ …ప్రస్తుతం కథలు వింటున్నానని తెలిపాడు. లవ్ స్టోరీ, సమాజానికి సందేశాన్ని ఇచ్చే సినిమాలు చేయాలనుకుంటున్నానని కథ ఒకే అయితే ఈ ఏడాదే ఆరంగేట్రం ఉంటుదని స్పష్టం చేశాడు.
- Advertisement -