విశాల్….అభిమన్యుడు ట్రైలర్‌

221
vishal

విశాల్ హీరోగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెర‌కెక్కిన చిత్రం అభిమ‌న్యుడు. తమిళ్‌లో సూప‌ర్ హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులో జూన్ 1న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న చిత్ర‌యూనిట్ తాజాగా ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది. సాధారణంగా మీకు కోపం ఎక్కువగా వస్తుంటుందా.. వీడికి కోపం మాత్రమే వస్తుంది..’ అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ట్రైలర్ ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు.

నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. మిలటరీ వాడికి పాస్‌పోర్టు ఉంటుంది, రేషన్‌ కార్డు సరిగా ఉంటుంది. కష్టం అని మీ దగ్గరికి వస్తే లోన్‌ ఇవ్వమంటారు అని విశాల్ డైలాగ్ చెప్ప‌గా ఇంతకు ముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ ‌వార్‌,‌ ఆ తర్వాత బయోవార్‌.. ఇప్పుడు సైబర్‌ వార్‌. నీతో సహా అందరు దొంగలు.. నేను తేలు, నేను కుడితే మూసుకుని ఉండాలి’ అంటూ అర్జున్ చెప్పే ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో తీర్చిదిద్దారు. ట్రైల‌ర్ పై మీరు ఓ లుక్కేయండి..

Abhimanyudu Trailer | Vishal, Arjun, Samantha | Yuvan Shankar Raja | P.S. Mithran