మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అభిమన్యుడు’. ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.
కాగా..ఈ చిత్రంలోని మొదటి పాటను యూత్‌స్టార్ నితిన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ‘తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. విప్పారిన కన్నుల్తో లోకాన్నే చూశా..’ అంటూ సాగే ఈ పాటను శ్రేష్ట రచించగా, యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో జితిన్‌రాజ్ ఆలపించారు.
ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి మాట్లాడుతూ ”హీరో నితిన్‌గారు ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. యువన్ శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. విశాల్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం” అన్నారు. మాస్ హీరో విశాల్, సమంత, యాక్షన్ కింగ్ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది.