సీఎం రేవంత్‌తో అభిజిత్ బెనర్జీ భేటీ

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించారు.

త్వరలో తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు రేవంత్. ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని కోరగా.. అందుకు అంగీకరించారు అభిజిత్ బెనర్జీ.

ఫ్యూచర్ సిటీలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచనలు ఇచ్చారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా ఇచ్చారు.

Also Read:మాన్‌సూన్‌పై మంత్రి పొన్నం రివ్యూ..

- Advertisement -