కూతురు పేరు ఇండియా.. కొడుకు పేరు తాజ్…

397
AB de Villiers Second Son Name is ‘Taj’
- Advertisement -

సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ కి భారత్ లో పెద్ద ఎత్తున్న ఫ్యాన్ ఫాలోయింది ఉంది. ఐపీఎల్ లో బెంగళూరు తరపున ఆడుతున్న ఏబీడీ, తన ఆట తీరుతో కోట్లాది మంది భారతీయ అభిమానులను సంపాదించుకున్నారు. ఏబీడీకి కూడా భారత్ పై ఎంతో ప్రేమ ఉంది. ఇండియాపై ఉన్న ప్రేమతో తన కూతురికి ‘ఇండియా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఏబీడీ మరోసారి ఇండియాపై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు.

AB de Villiers Second Son Name is ‘Taj’

బెంగళూరు తరపున ఆడుతున్న ఏబీడీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని వెల్లడించాడు. తన పెద్ద కుమారుడికి ‘తాజ్’ అని పేరు పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. తాజ్ పేరు కన్న ముందు బెంగళూరు జట్టుపై ఉన్న అభిమానంతో కర్ణాటక అని పెట్టాలనుకున్నానని తెలిపాడు. కానీ ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ఎదుట.. తన భార్య డేనియల్ కి ప్రపోజ్ చేశానని, అందుకే తన ప్రేమకు పునాది పడిన తాజ్ మహల్ కి గుర్తుగా తన కొడుకు పేరు ‘తాజ్ డివిలియర్స్ ‘గా నామకరణం చేస్తానని చెప్పాడు. అయినా మగపిల్లలకు తాజ్ అని పేరు పెడితే బలంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు.

- Advertisement -