స్టైలిష్ అండ్ సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం “ఆటగాళ్లు”. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్-జగపతిబాబు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది సినిమా యూనిట్. నారా రోహిత్-జగపతి బాబు సీరియస్ లుక్‌లో కనిపించే ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నారు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ.. “కథ నచ్చి ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. నారా రోహిత్ , జగపతిబాబు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. చాలా వైవిద్యమైన సినిమా ఇది. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందన్నారు.
దర్శకుడు మురళి “ఆటగాళ్లు” చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయని తెలిపారు.