నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభంకానున్నాయి. గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో తొలి బోనంతో మొదలు కానుండగా అధికారికంగా బోనాలను ప్రారంభించనున్నారు మంత్రులు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు ఉండనుంది.
గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్ర్తాలను ప్రభుత్వం తరఫున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతరాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది.
గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి.. గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు తీసుకెళ్తారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగుస్తుంది. అమావాస్యను పురస్కరించుకొని బుధవారం గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లతో పూజలను నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యే ముందు వచ్చే అమావాస్య రోజు గోల్కొండ కోటలో మెట్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Also Read:రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకెన్నాళ్లు?:జగన్

