ఆసీసీ టీ20 కెప్టెన్,పొట్టిక్రికెట్ స్పెషలిస్ట్ అరోన్ ఫించ్ విధ్వంసం సృష్టించాడు. పసికూన జింబాబ్వేపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీ20ల్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 76 బంతుల్లోనే 172 రన్స్ చేసి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతంలో తనపేరుతో ఉన్న ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఫించ్,షార్ట్ కలిసి తొలి వికెట్‌కి 223 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదుచేశారు. టీ 20ల్లో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఫించ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
షేన్ వాట్సన్ తర్వాత వరుసగా మూడు టీ20ల్లో సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్‌గా నిలిచాడు ఫించ్. తొలి 22 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఫించ్ 50బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచి సిక్సర్లు,ఫోర్లతో విరుచుకపడ్డాడు. ఓవరాల్‌గా 16 పోర్లు, 10 సిక్స్‌లతో 172 పరుగులు చేశాడు.