ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీయే భేష్‌..

210
CM KCR
- Advertisement -

మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా టీఆర్‌ఎస్‌ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు.

CM KCR

ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే బాగా ఉంది. అందుకే ఆయుష్మాన్ భారత్‌లో చేరమని ప్రధానికి చెప్పాం. కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వాల హక్కు తప్ప దయాక్షిణ్యం కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఉంది. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే నంబర్ 1గా ఉన్నామన్నారు.

- Advertisement -