- Advertisement -
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికకానున్నారు భజ్జి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజ్యసభ ఎంపీతో పాటు స్పోర్ట్స్ యూనివర్శిటీలో కీలక బాధ్యతలను కూడా భజ్జికి అప్పజెప్పనున్నారు కేజ్రీవాల్. రాజ్యసభలో ఆప్‌కు ఐదు సీట్లు దక్కనుండగా హర్భజన్ పేరును కేజ్రీవాల్ ఖరారు చేశారు.
వాస్తవానికి గతంలో హర్భజన్ కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వచ్చాయి. సిద్దూతో సైతం భేటీ అయ్యారు భజ్జీ. అయితే ఎవరూ ఉహించని విధంగా ఆప్ నుండి హర్భజన్‌ను రాజ్యసభకు ఎన్నికవడం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చకు దారితీసింది.
- Advertisement -