‘ఇష్క్’ నుండి బ్యూటిఫుల్ మెలోడీ..

98
Aanandam Madike Video Song

యంగ్ హీరో తేజ సజ్జ – వింకీ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా ‘ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ’ సినిమా రూపొందింది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఎన్వీ ప్రసాద్ .. పారస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ‘ఆనందం మదికే..’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, మహతి స్వరసాగర్ స్వరపరిచారు. బ్యూటిఫుల్ విజువల్స్ పై కట్ చేసిన ఈ పాట చాలా బాగుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

#AanandamMadike Full Video Song | Sid Sriram | Ishq Songs | Teja Sajja, PriyaVarrier | #ISHQOnJuly30