ఆమిర్ మూడో పెళ్లి..రాఖీ కామెంట్స్‌..!

38
- Advertisement -

దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా వేడుకలో బాలీవుడ్‌ నటీనటులు తళుక్కున మెరిశారు. ఈ సందర్భంగా నటి రాఖీ సావంత్ కూడా కనువిందు చేశారు. అయితే ఆమె రెడ్‌కార్పెట్‌పై ఓ విలేకరి ఆడిగిన ప్రశ్నకు స్పందించింది. మీ దృష్టిలో ముగ్గురు హాటెస్ట్‌గా నటీనటులు ఎవరు అని అడగ్గా..ఆమె షారుక్, సల్మాన్‌..మూడో వ్యక్తి ఎవరంటే…మూడో పెళ్లి చేసుకోబోతున్న ఆమిర్ ఖాన్ అయి ఉండొచ్చు . కానీ నాక్కూడా తెలియదు అని సమాదానమిచ్చి నవ్వులు పూయించారు. వెంటనే తన స్టేట్మెంట్‌ను ఉద్దేశిస్తూ..సారీ ఆమిర్..ఐ లవ్ యూ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగవైరల్‌ అవుతుంది.

2016లో విడుదలైన దంగల్ సినిమాలో ఆమిర్‌ఖాన్ కుమార్తెగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్‌లో గుసగుసలు. పలు సందర్భాల్లో కూడా ఆమె పలు వేడుకల్లోనూ కలిసి పాల్గొన్నారు. ఆమిర్ రెండో భార్య కిరణ్‌రావుకు 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంబంధాలు మరింత పెరిగిందని బాలీవుడ్‌ టాక్. అన్నట్టు ఆమీర్‌ కంటే సనా 26యేళ్లు చిన్నది.

Also Read: టైటిల్ ఉంటే నిజమవుతుందా..కమల్‌ హసన్‌

- Advertisement -