బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్, ఆయన సతీమణి కిరణ్‌రావులు స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థ, పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుణెలో జరుగుతున్న ‘సత్యమేవ జయతే వాటర్ కప్’ కార్యక్రమంలో ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆమిర్.. ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆయన ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాల్సి ఉన్నా.. స్వైన్‌ఫ్లూ సోకడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేకపోయినప్పటికీ తన స్నేహితుడు షారూక్‌ను పంపించాడు.
ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్నానని, తనకు ‘హెచ్1ఎన్1 (స్వైన్‌ఫ్లూ)’ ఉందని తేలిందని చెప్పారు. అందుకనే బయటికి రావడంలేదని, ఎవరినీ కలవడం లేదని వెల్లడించారు.
తన ఇన్ఫెక్షన్ ఇప్పుడు కిరణ్‌రావుకు కూడా సోకిందన్నారు. ఆమె కూడా స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కిరణ్‌రావు కూడా పాల్గొన్నారు. పానీ ఫౌండేషన్‌కు ఆమె సహ వ్యవస్థాపకురాలు.
#WATCH Pune: Aamir Khan says "have contracted Swine Flu and are skipping the event so that others do not contract the same". pic.twitter.com/xIa4keG2Mz
— ANI (@ANI) August 6, 2017
ఆమిర్‌కి స్వైన్‌ఫ్లూ సోకిన విషయాన్ని సీనియర్ జర్నలిస్టు అనుపమా చోప్రా ముందే వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సత్యమేవ జయతే వాటర్ కప్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకావడంలేదని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇక ఇదిలా ఉండగా… ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, నీతా అంబానీ, రాజీవ్ బజాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఆమిర్‌కు వారం పాటు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.