అమీర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్

210
aamir
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా సెకండ్ వేవ్ బారీన పడగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కరోనా బారిన పడ్డారు.

ఆయనకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం అమీర్ ఆరోగ్యం మెరుగుగానే ఉందని…ఇటీవలి కాలంలో ఆయనను కలిసిన వారుకూడా టెస్ట్ చేయించుకోవాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో అతడితో కలిసి షూటింగ్ పాల్గొన్న హీరోయిన్ కియారా అద్వానీ, టబు కూడా పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో కియారాకి నెగిటివ్ రిపోర్ట్ రాగా.. టబు రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

- Advertisement -