బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ‘అమీర్ ఖాన్’ తన రాబోయే సినిమా ‘దంగల్’ను వినూత్నంగా ప్రమోట్‌ను చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ‘యుద్ధం’ పేరిట విడుదల కానుంది. పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్‌తో మరోసారి అభిమానులను బాక్సాఫీస్ షేక్ చేయడానికి వస్తున్నాడు. సినిమాల్లో కొత్తదనం కొసం పరితపించే అమీర్‌ఖాన్.. పాత్రం కోసం ఎంత రిస్కైనా తీసుకుంటాడు. కథ ఎంచుకోవడం దగ్గర్నుంచి దాన్ని సమర్థంగా తెరకెక్కించడం కోసం అమీర్ చూపించే శ్రద్ధ ఇండియాలోని మిగతా హీరోలందరికీ ఆదర్శం అని చెప్పక తప్పదు.
రెజ్లర్ మహవీర్ పొగట్ నిజ జీవిత కథతో ‘దంగల్’ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం 95 కిలోల వరకు బరువు పెరగడం.. మళ్లీ బరువు తగ్గి కండలు తిరిగిన దేహంతో తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఈ సినిమా ఆమిర్ జీవితంలో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే చెప్పాలి.
సినిమాలో మహావీర్ ఫొగట్ మల్లయుద్ధంలో పాల్గొన్నప్పుడు ఫిట్‌గా కన్పించడానికి 25 కిలోలు తగ్గాడు. వివాహమై పిల్లలు పుట్టాక మళ్లీ బరువు పెరిగాడు. ఈ సినిమా కోసం ఆమిర్ ఫిట్ టు ఫ్యాట్ ఎలా అయ్యాడు అన్న విషయాలన్నీ చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ ఆమిర్ వర్కవుట్ వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖానే తన సొంత బేనర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకుడు.
సినిమాలో హానీకారక్ బాపు అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. సర్వార్ ఖాన్ మరియు సర్తాజ్ ఖాన్ పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. ప్రీతమ్ అందించిన సంగీతంకు మంచి అప్లాజ్ వస్తోంది. తాజాగా విడుదలైన తొలి సాంగ్ లో తన కూతుళ్ళను రెజ్లర్ గా తయారు చేసేందుకు తండ్రి వారిపై ఎంతటి శ్రద్ద వహించాడో ఈ సాంగ్ లో చూపించారు.