బిగ్ బ్రేకింగ్…15 ఏళ్ల వివాహ దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకుంటున్నట్లు బాంబ్ పేల్చారు. ఈ మేరకు విడాకులపై ఇద్దరు అధికారిక ప్రకటన చేశారు.
తమ పదిహేను సంవత్సరాల వివాహ జీవితంలో ఒకరిపై ఒకరం నమ్మకంతో, ప్రేమతో, గౌరవంతో ఉన్నాము. కానీ ఇప్పుడు మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం అని లేఖలో పేర్కొన్నారు. ఇక నుండి మేం భార్యాభర్తలం కాదు… కానీ పిల్లలకు కో పేరేంట్స్ గా ఉండబోతున్నాం అని తెలిపిన ఇద్దరూ.. సినిమాలు మాత్రం కలిసి చేస్తూనే ఉంటామని ప్రకటించారు.
1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ 2002లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి జునైద్,ఐరా అనే అబ్బాయి ఉన్నారు. తర్వాత 2005లో లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావ్‌ని రెండో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2007లో కిరణ్ రావ్…ఆజాద్‌కి జన్మనిచ్చారు. మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్న వీరి విడాకుల ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది.