హల్ చల్‌ చేస్తున్న అమీర్ ‘కూతుళ్లు’

330
- Advertisement -

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్‌ఖాన్.. లెజండ‌రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ పోగ‌ట్ జీవిత నేపథ్యంలో దంగల్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రెజ్లింగ్ నేప‌థ్యంలో త‌న ఇద్ద‌రు కూతుళ్ల క‌ల‌లు సాకారం చేయ‌డానికి పోరాడే తండ్రి పాత్రలో అమీర్ నటించాడు. పీకే లాంటి ప్రయోగాత్మక చిత్రంతో మెప్పించిన అమీర్ ఖాన్ ఇప్పుడు దంగల్ తో మరోసారి అభిమానులు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం కోసం అమీర్ బాగానే కసరత్తులు చేశాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలలో స్పీడ్ పెంచుతున్నాడు అమీర్.

Aamir Dangal movie promotion

ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌ కూతుళ్లుగా నటించిన ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్ర దంగల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హంగామా చేశారు. చాచీ 420లో కమల్ హాసన్ ముద్దుల కూతురిగా నటించి మెప్పించింది ఫాతిమా…తర్వాత ఇప్పుడు అమీర్‌తో కలిసి నటిస్తోంది.ఇక గతంలో అమీర్‌తో కలిసి టాటా స్కై యాడ్‌లో నటించింది సన్యా మల్హోత్రా.వెండితెరకు కొత్తే అయినా బుల్లితెరపై నటించిన అనుభవం ఉంది. ప్రస్తుతం అమీర్‌తో పాటు వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది.

Aamir Dangal movie promotion

ఇక అమీర్‌ జరిపిన దివాళీ వేడుకల్లో ఈ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫాతిమా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోగా, సన్యా పొట్టి స్కర్టులో కనువిందు చేసింది.

Aamir Dangal movie promotion

ఇటీవల విడుదలైన దంగల్ ‘దంగల్‌’ మూవీ ట్రైలర్‌కు ఉహించని విధంగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది.ఈ ట్రైలర్ లో ఎమోషన్,హ్యూమర్ లాంటి అన్ని ఎలిమెంట్లు క్యారీ చేశారు.ఇక అమీర్ దంగల్ మూవీలో హర్యానా భాష కోసం క్లాసులకెళ్లి మరీ నేర్చుకున్నాడు.అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించే దంగల్ మూవీ డిసెంబర్ లో స్క్రీన్ మీదకు రానుంది. ట్రైలర్ లోనే అమీర్‌ ఖాన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రీతమ్‌ చక్రవర్తి అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ ట్రైలర్‌కు మరో అస్సెట్‌గా నిలిచింది.

- Advertisement -