యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఆమె అతడైతే

247
'Aame Athadaithe' is a clean entertainer
- Advertisement -

ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ డాన్సర్‌ హనీష్‌ హీరోగా చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో మలినేని మారుతి ప్రసాద్‌, నెట్టెం రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. డిగ్రీ చదువుకున్న ఒక మిడిల్‌క్లాస్‌ కుర్రాడు తన తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడు అనే కధాంశంతో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం రూపొందింది. యశోకృష్ణ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవల రిలీజ్‌ అయి మ్యూజిక్‌ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. యుట్యూబ్‌లో పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా రిలీజ్‌ అయిన ఆడియో సక్సెస్‌ అయి ప్లాటినం డిస్క్‌ను సాధించింది.

ఈ సందర్భంగా నవంబర్‌ 9న హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ‘ఆమె అతడైతే’ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్‌, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, హీరో హనీష్‌, హీరోయిన్‌ చిరాశ్రీ, పాటల రచయితలు సుద్దాల అశోక్‌తేజ, భాస్కర్‌, దర్శకుడు కె.సూర్యనారాయణ, సంగీత దర్శకుడు యశోకృష్ణన్‌, ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధి నిరంజన్‌ వేదికపై ఆశీనులవగా నిర్మాతలు మలినేని మారుతి ప్రసాద్‌, నెట్టెం రాధాకృష్ణ బొకేలతో అతిథులకు స్వాగతం పలికారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివకుమార్‌, కిషన్‌రావులు చిత్ర యూనిట్‌కి ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.

Aame Athadaithe' is a clean entertainer

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించాను. చాలా మంచి పాత్ర. దర్శకుడు సూర్యనారాయణ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించారు. నిర్మాతలు మారుతి ప్రసాద్‌, రాధాకృష్ణలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కని సందేశం ఉన్న కథా చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం యూత్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది” అన్నారు.
ఆగ్రో ఇండస్ట్రీట్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో పాటలన్నీ విన్నాను. ప్రతి పాట మనసుకి హత్తుకునేలా ఉంది. యశోకృష్ణ మా ఊరి వాడే. చక్కని మ్యూజిక్‌ అందించాడు. ఆడియో సక్సెస్‌ అయినట్టే సినిమా కూడా విజయవంతం కావాలి” అన్నారు.

ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ – ”దర్శకుడు సూర్యనారాయణ ఈ సినిమా కాన్సెప్ట్‌ చెప్పాడు. చాలా డిఫరెంట్‌గా వుంది. సాంగ్స్‌ అన్నీ మంచి హిట్‌ అయ్యాయి. యశోకృష్ణ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ అందించాడు. ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్ధితి అయోమయంగా ఉంది. అయినా ఎంతో ధైర్యంతో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నందుకు నిర్మాతలను అభినందిస్తున్నాను. దేవిలాంటి పెద్ద థియేటర్‌ దొరకడం వారి అదృష్టం. ఈ చిత్రం మంచి హిట్‌ అయి నిర్మాతలు లాభాలు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Aame Athadaithe' is a clean entertainer

ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ – ”సూర్యనారాయణ గత కొంత కాలంగా తెలుసు. అతనిలో మంచి ఫైర్‌ ఉంది. కథ నెరేట్‌ చేసేటప్పుడే సినిమా కధాంశం నన్నెంతో ఆకట్టుకుంది. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా పాటలు రాశాను. యశోకృష్ణ బ్యూటిఫుల్‌ ట్యూన్స్‌ అందించారు. మా నాన్న హనుమంతుగారిని తల్చుకుని ఈ చిత్రంలో ‘నాన్న’ పాట రాశాను. ఈ పాట పెద్ద హిట్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దర్శకుడు సూర్యనారాయణ విజువల్‌గా ఈ చిత్రాన్ని ఫెంటాస్టిక్‌గా చిత్రీకరించాడు. నిర్మాతలు కొత్త అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు కె. సూర్యనారాయణ మాట్లాడుతూ – ”కథ చెప్పగానే ఎంతో ఇన్‌స్పైర్‌ అయి గో ఎహెడ్‌ అని మా నిర్మాతలు ఎంకరేజ్‌ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు సెట్‌కి రాకుండా నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ని నాకు అప్పగించారు. వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశానని అనుకుంటున్నాను. సినిమా చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. పబ్లిసిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా పెద్ద ధియేటర్స్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ గారు కాన్సెప్ట్‌ చెప్పగానే మంచి పాటలు రాశారు. నా బ్యాక్‌బోన్‌గా ఉంటూ ఎన్నో సలహాలు ఇచ్చి సపోర్ట్‌ చేశారు. అలాగే యశోకృష్ణ మంచి ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. ఆడియో పెద్ద హిట్‌ అయి ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరికీ నచ్చే చిత్రమిది” అన్నారు.

Aame Athadaithe' is a clean entertainer

మేధా చిరంజీవి మాట్లాడుతూ – ”పాటలన్నీ విన్నాను. చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాన్న పాట వింటుంటే కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. సూర్య నారాయణ ఎంతో హార్డ్‌వర్క్‌ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూత్‌ ప్రేక్షకులంతా ఇన్‌స్పైర్‌ అయ్యే విధంగా ఈ చిత్రం ఉంటుంది” అన్నారు.

Aame Athadaithe' is a clean entertainer
హీరో హనీష్‌ మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్‌ సూర్యగారు అందరి నుండి మంచి అవుట్‌పుట్‌ రాబట్టుకున్నారు. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరికీ ఈ చిత్రం బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు” అన్నారు.

సంగీత దర్శకుడు యశోకృష్ణ మాట్లాడుతూ – ”సుద్దాల అశోక్‌తేజగారు రాసిన పాటలకు బాణీలు సమకూర్చాను. సూర్యగారు మంచి పాటల్ని రాయించుకున్నారు. ఆడియో సక్సెస్‌లాగే సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.

Aame Athadaithe' is a clean entertainer
హీరోయిన్‌ చిరాశ్రీ మాట్లాడుతూ – ”ఈ సినిమాలో కాలేజ్‌ గర్ల్‌ క్యారెక్టర్‌లో నటించాను. చాలా మంచి పాత్ర. హీరో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఎంకరేజ్‌ చేసి సపోర్ట్‌ చేసే పాత్ర. సినిమా మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాతలు మలినేని మారుతిప్రసాద్‌, నెట్టెం రాధాకృష్ణ మాట్లాడుతూ – ”దర్శకుడు సూర్యనారాయణ మాకు కథ చెప్పిన దానికంటే స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజంట్‌ చేశాడు. మంచి పబ్లిసిటీతో క్రేజీ థియేటర్స్‌లో మా చిత్రాన్ని నవంబర్‌ 12న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. మా చిత్రాన్ని చూసి పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

- Advertisement -