వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్‌పై ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా రామ్‌భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం `ఆకతాయి`. ఈ సినిమామోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ చార్టెడ్ అకౌంటెంట్ కోటేశ్వరరావు మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఆకాష్‌రాజ్‌తో పాటు నిర్మాతలు కూడా హీరోలే కాబట్టి మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వారం రోజుల్లో రెండు పాటల షూటింగ్ పూర్తి చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. డైరెక్టర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. సినిమాను జనవరి లాస్ట్ వీక్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన కౌశల్ కరణ్ చెప్పారు. సినిమాలో చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశానని హీరో ఆకాష్ రాజ్ తెలియజేశారు. నవీన్, రుక్సార్ మీర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆశిష్‌రాజ్, రుక్సార్ మీర్, సుమన్, నాగబాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, అలీ, ప్రదీఫ్ రావత్, పోసాని, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో అమీషా పటేల్ స్పెషల్‌సాంగ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతంః మణిశర్మ, సినిమాటోగ్రఫీః వెంకట్ గంగదారి, ఆర్ట్ః మురళి కొండేటి, ఫైట్స్ః నందు, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, డ్యాన్స్ః జానీ మాస్టర్, స్వర్ణ, సతీష్, అమిత్, నిర్మాతలుః విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్, కథ, కథనం, మాటలు, దర్శకత్వంః రామ్ భీమన.