‘ఆకాశంలో ఒక తార’లో..సాత్విక

4
- Advertisement -

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తదుపరి తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పావన్ సదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన టీజర్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ముందుగా ప్రకటించినట్లుగానే, ఈ రోజు చిత్ర బృందం హీరోయిన్ పేరు మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. విడుదలైన లుక్‌లో ఆమె చాలా సరళంగా, సహజంగా, అలాగే ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో సాత్విక ఒక గ్రామీణ యువతిగా కనిపించనుంది. అంతరిక్షానికి వెళ్లాలనే గొప్ప కలలు కనుకునే అమ్మాయిగా ఆమె పాత్ర సాగుతుంది. ఆమె కలలు నెరవేరుతాయా? లేదా? అన్నదే కథలో ప్రధానాంశంగా ఉండనుంది. ఫస్ట్ లుక్‌తోనే సాత్విక మంచి ఇంప్రెషన్ ఇచ్చిందని, నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కొత్త హార్ట్‌త్రాబ్‌గా ఆమె ఎదిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

తుదిదశకు చేరుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి శ్రుతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇతర వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది.

- Advertisement -