దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ . యంగ్ ఫిల్మ్‌మేకర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ పాన్-ఇండియన్ డ్రామాలో సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. అన్ని భాషల డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.34 కోట్లకు సొంతం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆడియో హక్కులు కూడా రూ.7 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ నడుస్తోంది. ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయి డీల్ జరగడం విశేషంగా మారింది.
Also REad:రెండేళ్లలో రేవంత్ చేసింది శూన్యం:కేటీఆర్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుండగా, త్వరలోనే విడుదల తేదీతో పాటు ప్రమోషన్లు ప్రారంభించనున్నట్లు సమాచారం.లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

