‘దేవదాస్’ నుండి రష్మిక- ఆకాంక్ష ఫస్ట్‌లుక్‌..

332
- Advertisement -

అక్కినేని నాగార్జున-నానిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం‘దేవదాస్’.ఈ సినిమా అగ్ర నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తుండగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్‌ మరియు రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటిదాకా ప్రతి ప్రోమోలోనూ ప్రధానంగా హీరోల మాత్రమే కనిపించారు.ఈ సినిమాలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నాని జోడీగా రష్మిక మందన అలరించనున్న విషయం తెలిసిందే.

Nagarjuna,Nani

తాజాగా ఈ సినిమా నుంచి ఆకాంక్ష, రష్మికల ఫస్ట్ లుక్స్ లాంచ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక పూజ పాత్రలో కనిపించనుండగా.. ఆకాంక్ష జాహ్నవిగా కనిపించనుంది. ఈ ఫస్ట్ లుక్స్‌లో ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. రష్మిక మోడ్రన్‌గా అట్రాక్ట్ చేస్తుంటే.. ఆకాంక్ష చీరలో మెరిసి పోతోంది. ఇక వీరి పాత్రలను నానీ,నాగ్ ట్వట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు.

‘చాలా కాలం తర్వాత నా పక్కన అందమైన అమ్మాయి. మళ్లీ రొమాన్స్‌. ఈ రోజు సాయంత్రం మరో లిరికల్‌ పాటను విడుదల చేయబోతున్నాం’ అంటూ తన ప్రియురాలు జాహ్నవి(ఆకాంక్ష సింగ్‌) లుక్‌ను నాగ్‌ ట్వీటర్‌లో విడుదల చేయగా..ఇక పూజ పాత్రలో రష్మికను పరిచయం చేస్తూ.. ఆమె లుక్‌ను నాని రిలీజ్ చేశాడు. ‘ఫస్టు టైమ్ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగ్ అయింది పూజ గారు .. మళ్లీ ఎప్పుడు?’ అంటూ సినిమాలో తన పాత్ర పరంగా నాని ట్వీట్ చేశాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుక రానుంది.

- Advertisement -